VIDEO: రహదారి పరిస్థితి అధ్వానం

E.G: నిడదవోలు మండలంలోని సింగవరం, తాళ్లపాలెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రహదారి చెరువులను తలపిస్తుంది. ఆయా రహదారి గుండా వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.