VIDEO: డ్రోన్ కెమెరాకు చిక్కిన పేకాట రాయుళ్లు
GNTR: తెనాలి మండలం సంగం జాగర్లమూడి రైల్వే ట్రాక్ పక్కన పొదల్లో పేకాడుతున్న వారిని పోలీసులు డ్రోన్ కెమెరాలతో శుక్రవారం గుర్తించారు. డ్రోన్ చూసి కొందరు పారిపోగా, 12 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై ఆనంద్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1,62,450 నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నారని, మొత్తం 17 మందిపై కేసు నమోదు చేశారు.