ప్రాంతీయ బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంకులోకి విలీనం

KDP: మే 1న ప్రాంతీయ బ్యాంకులైన ఏపీజీబీ, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తదితర ప్రాంతీయ బ్యాంకులను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోకి విలీనం అవుతున్నట్లు ఏపీజీబీ మేనేజర్ కృష్ణ కిషోర్ తెలిపారు. మంగళవారం సింహాద్రిపురంలోని స్థానిక ఏపీజీబీలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల ఖాతాలో ఎటువంటి మార్పు ఉండదని, సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.