గిరిజన బిడ్డ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు

గిరిజన బిడ్డ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కడావత్ రాజేశ్వరి ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 377 మార్కులు సాధించి మెదక్ జిల్లాలోని మహేశ్వర మెడికల్ కళాశాలలో సీటును సంపాదించారు. కానీ, మొదటి విడతగా కట్టాల్సిన రూ.1.40 లక్షలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారని ఆమె కొండంత ఆశగా ఎదురుచూస్తోంది.