మంత్రికి వినతి పత్రం అందజేత

మంత్రికి వినతి పత్రం అందజేత

NDL: కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పర్యటించారు. కోయిలకుంట్ల మండలాన్ని డోన్ రెవెన్యూ డివిజన్ నుంచి తొలగించి నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో కలపాలని ప్రజాసంఘాల నాయకులు ఏం.సుధాకర్, కరీం బాషా కలిసి మంత్రికి వారు వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.