బసవేశ్వర జన్మోత్సవ తొట్టెల కార్యక్రమం
SRD: కంగ్టి మండల కేంద్రంలో బసవేశ్వర జయంతి ఉత్సవ వేడుకలను నేడు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మల్లికార్జున ఆలయంలో పూజారి శ్రీకాంత్ మల్లన్న స్వామి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద బసవేశ్వర జన్మోత్సవం తొట్టెల కార్యక్రమాన్ని చేశారు. బసవేశ్వర ప్రతిమను తొట్టెలలో ఉంచి భక్తి జోల పాటలను మహిళలు పాడారు. అనంతరం భక్తిశ్రద్ధలతో శివ భజనలు చేశారు.