'ఈ వ్యవహారంపై కేటీఆర్ వివరణ ఇవ్వాలి'
HYD: ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతుంటే, మరోవైపు BRS నేతలు డ్రగ్స్ పార్టీలతో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే వ్యవహారంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వివరణ ఇవ్వాలన్నారు.