'ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందాలి'

నాగర్ కర్నూల్ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వర్షాకాలంలో సంచార వైద్య వాహన సేవలు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రవికుమార్ తెలిపారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో 'పీఎం జన్మన్ సంచార వైద్య వాహన' సిబ్బందితో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.