IND vs SA: లంచ్ బ్రేక్.. భారత్ 174/7
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 174/7 పరుగులు చేసింది. 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ ముప్పు తప్పించుకునేందుకు ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది. సుందర్ (33*), కుల్దీప్ (14*) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 58, కేఎల్ 22 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సన్ 4 వికెట్లు, హార్మర్ 2 వికెట్లు పడగొట్టారు.