ఉయ్యూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఉయ్యూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: విద్యార్థులు గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని ఉయ్యూరు టౌన్ CI రామారావు అన్నారు. ఉయ్యూరులో విద్యార్థులకు మహిళా, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. శక్తి యాప్ వినియోగం, టోల్ ఫ్రీ నంబర్‌ల(100, 1098, 181) ప్రాముఖ్యతను వివరించారు. అపరిచితులతో మాట్లాడకూడదని, వేధింపులు జరిగిన వెంటనే పోలీసులకు చెప్పాలన్నారు.