'150 ఎకరాల ధర్మ సత్రానికి చెందిన భూమిలో అవకతవకలు'
KKD: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మ ధర్మ సత్రానికి చెందిన సుమారు 150 ఎకరాల భూమిలో అవకతవకులు జరుగుతున్నాయని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆరోపించారు. 150 ఎకరాలకు నిరుపేదలు శిస్తు కడుతుండగా, ఎండోమెంట్ రికార్డులలో కేవలం 25 ఎకరాలకే శిస్తు నమోదవుతుందన్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.