ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
VKB: ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం VKB జిల్లా కలెక్టరేట్ ఇంటర్ బోర్డు అధికారులతో కలెక్టర్ పరీక్షలు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.