ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే ఇవాళ సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.