ఐఐటీ మద్రాస్‌లో కమలాపురం పాలిటెక్నిక్ విద్యార్థి సత్తా
KDP: కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి ఎ. పాండురంగయ్య ఐఐటీ మద్రాస్‌లో ప్రతిష్టాత్మక 'డేటా సెంటర్ ఆపరేషన్' కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సును పూర్తి చేసిన తొలి పాలిటెక్నిక్ విద్యార్థిగా ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ అవసరాలకు అనుగుణంగా ఈ మూడు నెలల శిక్షణ జరిగింది.