ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు

AKP: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం 8 మంది లబ్ధిదారులకు గాను మొత్తం రూ.4.83లక్షలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రజలకు సహాయం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ అన్నారు. ఇప్పటి వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో 78 మందికి పైగా రూ.75లక్షల 83వేల 602లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేశామని తెలిపారు.