'వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మవద్దు'

కోనసీమ: రైతులు పట్ల ప్రేమ కాదు .. దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న బాధతోనే వైసీపీ నేతలు రైతు పోరు కార్యక్రమం చేపట్టారని కొత్తపేట మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం కొత్తపేటలో వారు మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో యూరియా కొరత ఎక్కడా లేదన్నారు. వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరూ నమ్మవద్దని సూచించారు.