డబుల్ ఇంజిన్ కాదు.. డొక్కింజన్ సర్కార్: తులసిరెడ్డి

డబుల్ ఇంజిన్ కాదు.. డొక్కింజన్ సర్కార్: తులసిరెడ్డి

కడప: ఎన్డీఏ పాలనలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు డొక్కింజన్ సర్కార్‌గా మారిందని మాజీ ఎంపీ తులసి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం వేంపల్లిలో మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు కురుస్తుందని చెప్పిన నాయకులు ఇప్పుడు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ, హోదా లేదన్నారు.