బాధిత కుటుంబానికి అండగా జనసేన

KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని చిన్నరాంపూర్ తండాకు చెందిన కేతావత్ హరి సింగ్ ఇటీవల మరణించడంతో, ఆయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా కింద మంజూరైన రూ. 5 లక్షల చెక్కును బాన్సువాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రవీందర్ చౌహన్, హరి సింగ్ భార్య రుక్కి భాయ్‌కు శనివారం అందజేశారు.