VIRAL: వరదలా ప్రవహిస్తున్న వడగళ్లు
చైనాలోని గ్వీజౌ ప్రావిన్స్‌లో వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. గ్వీయాంగ్ నగరంలో కురిసిన భారీ తుఫాన్ ధాటికి వీధులన్నీ నడుము లోతు వడగళ్లతో నిండిపోయాయి. రోడ్లపై నీటిలో మంచు గడ్డలు వరదలా ప్రవహిస్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.