‘పది’ పరీక్షలకు బందోబస్తు సిద్ధం: SP
కోనసీమ: ఇవాళ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు SP రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.