ఉపాధ్యాయులను విడవలేక కన్నీటి వీడ్కోలు
SDPT: జిల్లా చేర్యాల మండలం ఆకునూరు పాఠశాలలో గురువులు, శిష్యుల మధ్య ఉన్న అనుబంధం అందరినీ కదిలించింది. ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు హైస్కూల్కు వెళ్తూ తమ ఉపాధ్యాయులను విడవలేక కన్నీటి పర్యంతమయ్యారు. కన్నబిడ్డల్లా చూసుకున్న గురువులకు పాదాభివందనం చేసి భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు.