79 స్థానాలను కైవసం చేసుకుని BRS విజయభేరి: MLA
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొదటి విడత స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసినట్లు MLA కోవలక్ష్మి శనివారం ప్రకటనలో తెలిపారు. 161 సర్పంచ్ స్థానాలకు BRS ఏకంగా 79 స్థానాలను కైవసం చేసుకుని విజయభేరి మోగించిందన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.