'రైతులను రాజులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం'
కోనసీమ: రైతులను రాజులుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఆలోచన అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడులో జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు.