మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజలు

మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజలు

GDWL: అయిజ పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవరం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని గాజులపేట, మడ్డిగుంతతోపాటు పలు కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.