బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు
KNR: కరీంనగర్లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు వేణుతో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తేనే కేంద్ర నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.