డీఎస్సీ మెరిట్ లిస్ట్ జాబితా పాత విధానంలోనే కొనసాగించాలి: AISF

ATP: డీఎస్సీ మెరిట్ లిస్ట్ జాబితా పాత విధానంలోనే కొనసాగించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి డిమాండ్ చేశారు. జిల్లాలో నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.