ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
NTR: నందిగామ మండలం కొండూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య స్వయంగా దర్బార్‌కు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వత్సవాయి మండలం పొలంపల్లి మునేరు ఆనకట్టను అభివృద్ధి చేయాలని పలువురు రైతులు కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.