VIDEO: నీటి సమస్యపై కమిషనర్‌కి వినతి

CTR: గూడూరుపల్లి టిడ్కో అపార్ట్ మెంట్స్‌లో నీటి సమస్యను పరిష్కరించాలని నివాసులు కోరారు. గురువారం మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డికి మహిళలు వినతి పత్రం అందజేశారు. A-7 అపార్ట్ మెంట్‌లో నీటి సమస్య ఉందని చెప్పారు. గెట్ వాల్వ్, పైపులు దెబ్బతిన్నాయన్నారు. వాటిని సరిచేసి వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని DE మహేష్‌కు కమిషనర్ సూచించారు.