జిల్లాను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

KMM: జిల్లాను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావి, నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని సందర్శించి, పర్యాటక అభివృద్ధి పనులను సమీక్షించారు. రూ.29 కోట్లతో ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.