'మే 12 నుంచి స్లాట్ బుకింగ్'

మేడ్చల్: ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 12 నుంచి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుందని సబ్ రిజిస్ట్రార్ విజయ జ్యోతి శనివారం తెలిపారు. ఇందుకోసం మరో రిజిస్ట్రార్‌ని కేటాయించనున్నారు. మొత్తం 96 స్లాట్లు అందుబాటులో ఉంటాయని, స్లాట్ ప్రకారంగా కార్యాలయానికి రావాలని సూచించారు.