34 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో కలిశారు..!
GDWL: అయిజ మండలం సింధనూరు జడ్పీహెచ్ఎస్లో 1991- 92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అదే పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు వారికి పాఠ్యాంశాలు బోధించిన గురువులను సన్మానించారు. బాల్యం ఎంతో గొప్పదని, ఎంతటి వారైనా బాల్యం పొందలేరని, ఆనాటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు.