పారదర్శకంగా SC వర్గీకరణ, కులగణన: మండలి ఛైర్మన్ గుత్తా

BHNG: దేశంలో SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా కులగణన నిర్వహించి, BC లకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఛైర్మన్ ఆవిష్కరించి ప్రసంగించారు.