సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం
KKD: వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఎంతోమందికి ఆర్థిక సాయం అందిస్తుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఆదివారం తాళ్లరేవు మండలంలో 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 5.04 లక్షలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.