మాచాని రాజేంద్రప్రసాద్ మృతి.. రాజకీయ నాయకుల నివాళులు
KRNL: ఎమ్మిగనూరులో పద్మశ్రీ మాచాని సోమప్ప మనువడు మాచాని రాజేంద్ర ప్రసాద్ ధని అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. ఆయన మరణవార్తతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ, జిల్లా ఉపాధ్యక్షులు మురహరి రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేనేత అభివృద్ధికి మాచాని కృషిని కొనియాడారు.