రూ.3 కోట్ల కరెన్సీతో అమ్మవారికి అలంకారం
GNTR: నకరికల్లు మండలం నరసింగపాడులో కొలువైన గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నపూర్ణ దేవికి రూ.3 కోట్లు, 10, 20, 50, 100, 500 నూతన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అమ్మవారిని అలంకరణ చేశారు.