అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి: మాజీ మంత్రి
MHBD: మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ సర్వే పనులను అడ్డుకుంటారనే అనుమానంతో జలసాధన కమిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా విమర్శించారు. “ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. ప్రజల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆమె అన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.