రేపు చాట్రాయిలో మంత్రి పర్యటన

ELR: చాట్రాయి గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సమాచార శాఖ బుధవారం తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొంటారని చెప్పారు. మండల పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు తెలపవచ్చన్నారు.