నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

ప్రకాశం: పెద్దారవీడు మండల సర్వసభ్యసమావేశం బుధవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో జాన్‌సుందరం తెలిపారు. ఎంపీపీ బెజబాడ పెద్ద గురవయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్నీ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరుకావాలని ఆయన కోరారు.