VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. తగ్గిన పత్తి ధర

VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. తగ్గిన పత్తి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.18,900, కొత్త మిర్చి రూ.19,000, పత్తి ధర రూ.7,400 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ నడిచిన శుక్రవారంతో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.400, ఏసీ మిర్చి ధర రూ.300 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం రూ.100 తగ్గినట్లు పేర్కొన్నారు.