PG, B.Ed, M.Ed పరీక్షలు వాయిదా

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.