పరారీలో ఉన్న పంజాబ్ ఎమ్మెల్యే అరెస్టు
అత్యాచారం కేసులో నిందితుడు, పంజాబ్ MLA హర్మీత్‌సింగ్ పఠాన్ మజ్రాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. 6 నెలలుగా అతను పరారీలో ఉన్నారు. గ్వాలియర్ వద్ద అతన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు. హర్మీత్‌సింగ్ కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ MLA పఠాన్ పేరుతో గాలించారు. దాదాపు ఏడు రాష్ట్రాల్లో బృందాలు అతని కోసం అన్వేషించాయి.