'పామాయిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

ELR: జిల్లాలో సుమారు పదివేల మంది పామాయిల్ గెలలు, మట్టలు కోసే కార్మికులు ఉన్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జీలుగుమిల్లిలో సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీ యాజమాన్యాల ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.