'గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు'
JGL: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని శనివారం కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్య కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు.