హనుమాన్ జంక్షన్ నుంచి సచివాలయానికి మెట్రో బస్సు

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ నుంచి రాష్ట్ర సచివాలయం వెలగపూడికి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి సచివాలయానికి బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి హనుమాన్ జంక్షన్‌కి సర్వీస్ నడుస్తుందని వివరించారు.