VIDEO: అది BRS ఎందుకు అయిందో చెప్పగలరా..?
HYD: మైక్ ఉంది కదా అని మాజీ మంత్రి KTR ఏదేదో మాట్లాడుతున్నారని తెలంగాణ ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం అప్పుడు KTR ఎక్కడ ఉండేవారో చెప్పమన్నారు. TRS పార్టీ BRS ఎందుకు అయిందో KTR చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఏర్పాటైన ఒక పార్టీ అని చెప్పిన మీరు.. అది బీఆర్ఎస్ ఎందుకు అయిందో చెప్పగలరా అని ప్రశ్నించారు.