భూముల సర్వేను పరిశీలించిన కలెక్టర్

భూముల సర్వేను పరిశీలించిన కలెక్టర్

KMR: భూభారతి చట్టం ప్రకారం భూముల సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలో కలెక్టర్ నేడు పరిశీలన చేశారు. సాగుభూముల సర్వే వివరాలు, పాస్‌పుస్తకాల దరఖాస్తులు, భూ విస్తీర్ణం, సాగు చేసే రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూముల పరిశీలనకు అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పని చేయాలన్నారు.