యుద్ధం.. ముగ్గురు భారతీయులు మృతి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముగ్గురు భారతీయులు మృతి చెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఈ ముగ్గురు భారతీయ నావికులని తెలిపారు. ఇటీవల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ చమురు నౌకపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడి వల్ల ఆ నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది తీవ్రంగా గాయపడి చనిపోయారు.