భర్తకు పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు
TG: ఇద్దరు భార్యలు కలిసి భర్తను సజీవదహనం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భీమ్‌గల్‌కు చెందిన మోహన్.. మొదటి భార్యకు పిల్లలు లేరని, రెండో వివాహం చేసుకున్నాడు. అతడు తరచూ మద్యంతాగి భార్యలతో గొడవ పడేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ జరగ్గా.. మద్యం మత్తులో ఉన్న మోహన్‌పై ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.