VIDEO: వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్

VIDEO: వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్

WGL: వర్ధన్నపేట పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని సాధన సమితి కోరింది. ఈ డిమాండ్‌తో వర్ధన్నపేట సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్న పాత స్థలంలోనే ఆసుపత్రి నిర్మించాలని, ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.