VIDEO: నిర్మల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
నిర్మల్ జిల్లా కేంద్రం నడిబొడ్డున, తిరుమల లాడ్జి ముందు గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోతీ నగర్ కాలనీకి చెందిన సాజిత్ ఖురేషి (46) అనే వ్యక్తి మృతి చెందాడు. అతను ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన థాహార్ వాహనం ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.